టాలీవుడ్: ఈ సంవత్సరం ఆరంభంలో క్రాక్ సినిమాతో ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ అందించిన హీరో రవి తేజ. ఈ హీరో ఇపుడు మరో సినిమా విడుదలకి రంగం సిద్ధం చేస్తున్నాడు. రవితేజ నటిస్తున్న ‘ఖిలాడీ’ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ‘రాక్షసుడు’ లాంటి సైకో థ్రిల్లర్ సినిమా తీసిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. రవితేజ కి జోడి గా ఈ సినిమాలో మీనాక్షి చౌధరి , డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో రవి తేజ రెండు పాత్రల్లో నటించనున్నట్టు ఒక టాక్ కూడా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది.
ఈ టీజర్ లో ఉన్న సీన్స్ చూస్తున్నా కూడా ఈ సినిమాలో రవి తేజ రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్టు హింట్స్ అందుతున్నాయి. కొన్ని సీన్స్ లో రవి తేజ జైలు లో ఉండడం, మరో పాత్రలో సుత్తి పట్టుకుని కిరాతకంగా చంపడం లాంటి సీన్స్ తో దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ గా ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్ ద్వారా అర్ధం అవుతుంది. అంతే కాకుండా టీజర్ లో చూపించిన ప్రతీ సీన్ లో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సుజిత్ వాసుదేవ్ మరియు జి.కె. విష్ణు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘మీరు స్టుపిడ్ ఎమోషన్స్ లేకుండా స్మార్ట్ గా ఆడితే.. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు’ అని రేవి తేజ స్టైల్ లో డైలాగ్ చెప్పి టీజర్ ముగించారు. ఈ సినిమాని జూన్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.