టాలీవుడ్: టాలీవుడ్ లో సెకండ్ జెనరేషన్ మెగా బ్రదర్స్ రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ వరుసగా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నారు. ఈ రోజు ఉగాది సందర్భంగా వీళ్ళ సినిమాలకి సంబందించిన లేటెస్ట్ పోస్టర్స్ విడుదల చేసి విషెస్ తెలియచేసింది సినిమా టీం.
రామ్ చరణ్ ప్రస్తుతం రెండు మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో జూనియర్ ఎన్ఠీఆర్ తో కలిసి RRR సినిమాలో నటిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమా నుండి ఒక సెలబ్రేషన్ పోస్టర్ విడుదల చేసారు. అంతే కాకుండా తన తండ్రి చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇదివరకే రామ్ చరణ్ సింగిల్ లుక్ విడుదలైంది. ఈ రోజు ఈ సినిమాలో చరణ్ పెయిర్ పూజ హెగ్డే తో కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేసింది సినిమా టీం.
మరో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో F3 సినిమాలో నటిస్తున్నాడు. దానితో పాటు ‘ఘని’ అనే బాక్సింగ్ నేపధ్యం లో ఉన్న స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా లో నటిస్తున్నాడు. ఈ సినిమా నుండి కూడా ఇదివరకే వరుణ్ తేజ్ సింగిల్ లుక్ విడుదలైంది. ఈరోజు ఈ సినిమా హీరోయిన్ ని మొదటి సారి పరిచయం చేస్తూ హీరోయిన్ తో ఉన్న పోస్టర్ విడుదల చేసి ఉగాది శుభాకాంక్షలు తెలియచేసింది సినిమా టీం. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో శాయి మంజ్రేకర్ కలిసి నటిస్తుంది. ఈ హీరోయిన్ నటించిన మేజర్ సినిమా కూడా విడుదలకి సిద్ధం అవుతుంది.