హైదరాబాద్: హీరో నిఖిల్, హ్యాపీ డేస్ లో సినిమా ప్రయాణం మొదలు పెట్టిన హీరో వరుస పరాజయాల తర్వాత పంథా మర్చి కొత్తదనం ఉండే సినిమాలతో వరుస విజయాలతో యువ హీరోల్లో కొత్త కథలలో నటించే కథానాయకులలో ముందు వరుస లో ఉన్నాడు. నిన్న అభిమానులతో లైవ్ చాట్ చేసిన నిఖిల్ తన గురించి కొత్త విషయాలు చెప్పుకొచ్చారు అలాగే పలు విషయాలపై తన స్పందన తెలియచేసారు.
నేపాటిసమ్ పై స్పందించిన నిఖిల్, నేపాటిసమ్ ఎక్కడైనా ఉంటుందని వారసత్వం ఉన్న లేకున్నా టాలెంట్ , హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళకే భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. టాలీవుడ్ లో అలాంటిదేమి లేదని ఇక్కడ స్నేహపూరిత వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు.
ఒక అభిమాని ఈ మూడు నెలల ఖాళీ సమయం లో మీరు ఏం చేశారు అంటూ ప్రశ్నించగా, చాలా నేర్చుకున్నాను. ఈ ఫ్రీ టైంలో నేను ఆన్ లైన్ ఫిల్మ్ మేకింగ్ క్లాస్ లు విన్నాను. డైరెక్షన్ మరియు ఇతర టెక్నికల్ విషయాలపై అవగాహణ పెంచుకున్నాను అంటూ నిఖిల్ చెప్పాడు. నిఖిల్ కెరీర్ ఆరంభంలో సహాయ దర్శకుడిగా చేసిన విషయం తెల్సిందే. చూస్తుంటే నిఖిల్ భవిష్యత్తు లో దర్శకత్వం చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం నిఖిల్ చందూ మొండేటి తో ‘కార్తికేయ 2′ , సూర్య ప్రతాప్ దర్శకత్వం లో ’18 పేజెస్’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు కూడా విభిన్న కథా చిత్రాలే అని చెప్పుకుంటున్నారు.