టాలీవుడ్: స్టార్ కమెడియన్ గా ఎదిగి ఆ తర్వాత హీరోగా ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ లాంటి సక్సెస్ లని అందించి ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా కానీ సక్సెస్ మాత్రం వరించలేదు. ఇక మళ్ళీ కమెడియన్ ఆఫర్స్ కోసం వెతుకుతూ, విలన్ పాత్రలు కూడా చేస్తూ అడపా దడపా హీరో పాత్రలు చేస్తున్నాడు సునీల్. ప్రస్తుతం సునీల్ హీరోగా మరో ప్రాజెక్ట్ సిద్ధం అవుతుంది. ఇది కేవలం తెలుగు మాత్రమే కాకుండా తెలుగు – కన్నడ బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా రూపొందుతుంది.
సునీల్ హీరో గా DTS (డేర్ టు స్లీప్) – ధైర్యం ఉంటె నిద్రపో అనే సినిమా రూపొందుతుంది. టైటిల్ ని బట్టి ఇదేదో కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అని అనిపిస్తుంది. ఈ సినిమాని తెలుగు సంగీత దర్శకుడు ‘సాయి కార్తీక్’ నిర్మిస్తున్నాడు. నిర్మాణమే కాకుండా సంగీతం కూడా అందిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ సూరజ్ దేవ్ అనే పాత్రలో నటించనున్నట్టు ప్రకటించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసింది సినిమా టీం.
అభిరామ్ పిల్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో డోనల్, నటాషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి దివిజ సమర్పణలో ఎస్ఎస్ స్టూడియోస్ బ్యానర్ పై సాయి కార్తీక్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సునీల్ మరోసారి సక్సెస్ బాట పట్టాలని ఆశిద్దాం.