హైదరాబాద్: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దాదాపు టాలీవుడ్ లో ఇప్పుడున్న అగ్ర తారలందరితో సినిమాలు చేసాడు. జనగణమన – ఈ సినిమా ఇదివరకే మహేష్ బాబు తో చేయాల్సి ఉంది. అప్పట్లో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు, కానీ సినిమా పట్టాలెక్కలేదు. ఈమధ్య సోషల్ మీడియా లైవ్ లో పూరిజగన్నాథ్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అది నా డ్రీం ప్రాజెక్ట్ అని ఎప్పటికైనా తీసి తీరుతా అని చెప్పారు. ఆ సినిమా పై ఇంకా వర్క్ చేస్తున్నా అని, ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని త్వరలోనే మొదలుపెడతా అన్నట్టు చెప్పుకొచ్చారు.
ఇస్మార్ట్ శంకర్ విజయం తో మంచి సక్సెస్ లో ఉన్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే మూవీ చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నాం అని ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్ మరియు డైలాగ్ డెలివరీ బాగా ఎంజాయ్ చేస్తున్నా అని విజయ్ గురించి చెప్పారు. అలాగే ఈ సినిమాని పూరి మరియు ఛార్మి నిర్మిస్తున్నారు. విజయ్ కి జోడిగా బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తున్న ఈ సినిమాకి ఇస్మార్ట్ శంకర్ తో మల్లి కంబ్యాక్ అయిన మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. బహుశా ఈ సినిమా తర్వాత పూరి జనగణమన మొదలుపెడతారు అనిపిస్తుంది