న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి యొక్క రెండవ వేవ్ రోజురోజుకి విజృంభిస్తోంది. మొదటి దశ కన్నా అత్యంత వేగంగా విస్తరిస్తున్న దీన్ని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
ఇప్పుడు వ్యాక్సిన్ వేసే విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం వెలువరించింది. రేపు నెల మే 1 నుంచి 18 ఏళ్లు పై బడిన అందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఫేజ్-3 వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. అయితే దీని కోసం కోవిన్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
కాగా తొలి దశలో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వగా తర్వాత 60 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చారు. ప్రస్తుతం 45 ఏళ్లు వారందికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. తాజాగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో 18 ఏళ్లు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.