న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ధర దాదాపు రూ.3,358 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల నగల తయారీ బంగారం 10 గ్రాములు ధర కూడా రూ.2,416 పెరిగింది.
బంగారం ధరల పెరుగుదలకు ముఖ్యమైన కారణం స్టాక్ మార్కెట్లు మరియు కరోనా ప్రభావమే. దేశం మొత్తం మీద లాక్డౌన్ ప్రకటిస్తారనే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం కొనసాగుతోంది. దీంతో చాలా మంది మదుపరులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది.
కాగా ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం ధర కూడా భారీగా తగ్గింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,555 నుంచి రూ.47,174కు పడి పోయింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,560 నుంచి 43,211కు చేరుకుంది. అంటే ఒక్క రోజులో సుమారు రూ.350 తగ్గింది.
ఇదిలా ఉండగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.44,250 నుంచి రూ.44,150కు చేరింది. పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.48,270 నుంచి రూ.48,160కు తగ్గింది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి.