అమరావతి: దేశమంతా కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశం మొత్తం మీద గత 4 రోజులుగా 2 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కాగా గత 24 గంటల్లో ఏపీలో 37,922 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది.
కాగా ఇదే సమయంలో కరోనా వైరస్ బారిన పడి 35 మంది చనిపోయారు. అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి కోలుకుని 3,116 మంది క్షేమంగా బయటపడ్డారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా, 9 లక్షల 15వేల 626 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు.
అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 53,889 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,57,53,679 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.