న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఒక్క రోజు లోనే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేసింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,14,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్క రోజే 2104 మంది కరోనా బాధితులు మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం తన హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కోవిడ్ నుంచి ఈ రోజు 1,78,841 మంది బాధితులు కోలుకొని దేశంలోని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవడం జరిగింది. కాగా ఇప్పటి వరకు మొత్తం 1,59,30,965 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 1,34,54,880 మంది కోలుకున్నారు.
తెలంగాణలో కూడా కరోనా రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 5,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 23 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.