ముంబై: అదితి రావు హైదరి నటించిన మలయాళం సినిమా ‘సూఫియుమ్ సుజాతయుమ్’ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అయింది. ఈ సినిమా జులై 3 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. మలయాళం లో ఇది ఓటీటీ లో రిలీజ్ అయ్యే మొదటి సినిమా. 14 ఏళ్ల తర్వాత అదితిరావుకి ఇది మలయాళం లో కంబ్యాక్ ఫిలిం. ఇంతకముందు ‘ప్రజాపతి’ అనే సినిమాలో మమ్ముట్టి సరసన నటించింది.
‘సూఫియుమ్ సుజాతయుమ్’ సినిమా ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ గా రూపొందించబడింది. ఈ సినిమా హిందూ ముస్లిం అనే సున్నితమైన అంశాన్ని తీస్కొని చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు అని సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది. అదితి ఈ సినిమా గురించి చెప్తూ ‘ ఇది ఒక సున్నితమైన ప్రేమ కథ అని ఎటువంటి మూఢ నమ్మకాలకి న్యూనత లకి లొంగని ప్రేమ కథ’ అని చెప్పుకొచ్చారు. అదితి తో పాటు ఈ సినిమాలో వాజిర్ , జయసూర్య నటించారు. నారాణిపుల శనవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని విజయ్ బాబు నిర్మించారు.
ట్రైలర్ ఆద్యంతం ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ లాగా మంచి అనుభూతి కలిగించారు. ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించే హిందూ అమ్మాయిగా అదితి నటించారు. ఇది తెలిసి వేరే వారికి అదితిని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయి చివరికి అదితి తన ప్రేమని గెలుచుకుంటుందా లేదా అనేది జులై 3 వారికి వేచి చూడాల్సిందే.
మంచి ప్రేమ కథలని హృద్యంగా చెప్పే విధానం లో తమని మించిన వారు లేరని ఇదివరకే మలయాళం సినిమా పరిశ్రమ ప్రేమమ్, ఎన్ను నింట మొయిదీన్ లాంటి సినిమాల ద్వారా నిరూపించారు. ఈ సినిమా కూడా అదే బాటలో అంతకన్నా విజయవంతం అవ్వాలని వీక్షకులకు మంచి అనుభూతి కలిగించాలని కోరుకుంటున్నాం.