టాలీవుడ్: 90 వ దశకంలో తెలుగులో ఫామిలీ సినిమాల రారాజు గా ఉన్న హీరో జగపతి బాబు. ఆ తర్వాత హిట్లతో వెనకపడడంతో హీరోగా కనుమరుగయ్యారు. కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని బాలకృష్ణ నటించిన ‘సింహా’ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. అప్పటి నుండి జగపతి బాబు వెనకకి చూసుకున్నది లేదు. కారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అద్భుతమైన పాత్రలు చేస్తున్నాడు. హీరోగా చేసినప్పటి కన్నా మంచి పాత్రలు మంచి గుర్తింపు లభిస్తుంది. క్లాస్ అయినా మాస్ గెటప్ అయినా జగ్గూ భాయ్ కి యిట్టె సెట్ అయిపోతాయి. ఈ మధ్య వచ్చిన పాత్రల్లో జగపతి బాబు కి బాగా పేరు తెచ్చిపెట్టినవి ‘అరవింద సమేత’ లోని బసిరెడ్డి మరియు రంగస్థలం లోని ప్రెసిడెంట్ పాత్ర.
ఈ రెండిట్లో బసి రెడ్డి పాత్ర నటన పరంగానే కాకుండా లుక్ పరంగా మంచి రెస్పాన్స్ లభించింది. ఇపుడు మరో పాత్ర చేయబోతున్నాని బసి రెడ్డి కి మించిన లుక్ ఉండబోతుందని జగ్గు భాయ్ ఇంస్టాగ్రామ్ లో తెలిపారు. ఈ మధ్య ఇన్స్టా ఓపెన్ చేసిన జగ్గూ భాయ్ ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా తెలిపారు. రజినీకాంత్ తో ‘శివ’ దర్శకత్వంలో ‘అన్నాత్తే‘ అనే సినిమాలో నటిస్తున్నాడు జగపతి బాబు. ఇదివరకే రజిని తో ‘కథానాయకుడు’, ‘లింగా’ సినిమాలో నటించిన జగపతి బాబు మరో సారి ఈ సినిమాలో రజిని తో నటించనున్నాడు. ఈ సినిమాలో తన లుక్ బసి రెడ్డి ని మించిపోతుంది కాస్ట్యూమ్స్ కూడా చూపించాడు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.