టాలీవుడ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ఈ నెల 9 న వరల్డ్ వైడ్ గా థియేటర్ లలో విడుదలైంది. రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ గా విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్టామినా ని మరో సారి రుజువు చేసింది. కరోనా ఆంక్షలు ఉన్నా, కోవిడ్ కారణంగా ఎక్కువ శాతం జనాలు థియేటర్లకు రాకపోయినా, ఒక రీమేక్ సినిమా అయినా, ఆంధ్రాలో టికెట్ రేట్ లు తగ్గించినా కూడా పవన్ కళ్యాణ్ స్టామినా ని ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. ఒక్క వారం లోనే వంద కోట్ల కలెక్ట్ చేసినట్టు వార్తలు వినిపించాయి.
దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఓటీటీ లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు కానీ ఇపుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు పూర్తిగా మూత పడడం తో ఇపుడిపుడే మళ్ళి థియేటర్లు తెరచుకుని పరిస్థితి లేకపోవడం తో ఈ సినిమాని 21 రోజుల్లోనే ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. ఈ శుక్రవారం (ఏప్రిల్ 30 ) నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది. ఈ సినిమా ఫుల్ రన్ పూర్తి అవకుండానే థియేటర్లు మూతపడుతుండడం తో ఫామిలీ ఆడియన్స్ కోసం ఇలా ఓటీటీ లో విడుదల చేసినట్టు అనిపిస్తుంది.