కోలీవుడ్: ధనుష్ రీసెంట్ గా ఏప్రిల్ 9 న కర్ణన్ అనే సినిమా విడుదల చేసాడు. పరియేఱుమ్ పెరుమాళ్ దర్శకుడు మారి సెల్వరాజ్ రూపొందించిన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించి మరి కొద్దీ రోజుల్లో ఓటీటీ లో రానుంది. కానీ ఈ సినిమా కాకుండా సంవత్సరం కన్నా ఎక్కువ రోజుల నుండి ధనుష్ నటించిన మరో సినిమా విడుదల వివాదం లో ఉంది. ‘జిగర్తాండ’, ‘పేట’ సినిమాలని డైరెక్ట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో ధనుష్ ‘జగమే తంత్రం’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా కరోనా క్రైసిస్ కి ముందు గానే విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా టైం లో ఈ సినిమాను ఓటీటీ కి అమ్ముకున్నారు నిర్మాతలు.
కానీ థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఈ సినిమాని థియేటర్ లో విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు నిర్మాతలు. ఈ క్రమం లో ఈ సినిమా ఓటీటీ లో విడుదల అవుతుందా లేక థియేటర్లలోనే అని కొద్దీ రోజులు వివాదం నడిచింది. చివరికి హీరో ధనుష్ కూడా ఈ సినిమాని పక్కన పెట్టి తన తదుపరి సినిమాల పైన దృష్టి పెట్టాడు. ఎట్టకేలకి ఈ సినిమా ఓటీటీ లో విడుదల అవనున్నట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. జూన్ 18 నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో ‘జగమే తంత్రం’ సినిమా అందుబాటులో ఉందనున్నట్టు ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం స్పెషల్ ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.