టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో శతాధిక సినిమాలు చేసిన హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ కెరీర్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లి సందడి’ ఒక మైలు రాయి గా నిలిచింది. మ్యూజిక్ పరంగా, కామెడీ పరంగా పెళ్లి సందడి సినిమా అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది. ఇప్పుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ఈ సినిమాకి సీక్వెల్ గా ‘పెళ్లి సందD’ సినిమా రూపొందుతుంది. ఈ రోజు ఈ సినిమా నుండి మొదటి పాటని విడుదల చేసింది సినిమా టీం. పెళ్లి సందడి కి సంగీతం అందించిన కీరవాణి సంగీతంలోని ఈ సినిమా రూపొందుతుంది. ‘ప్రేమంటే ఏంటి’ అంటూ సాగే ఈ పాట రెగ్యులర్ కీరవాణి బాణీల్లాగే ఆకట్టుకుంది.
ఒక మెలోడీ లాగా రూపొందిన ఈ పాటని మంచు కొండల్లో షూట్ చేసారు. లిరికల్ వీడియో లో దర్శకేంద్రుడి సూచనలతో జరిపిన షూటింగ్ వీడియోస్ ని జత చేసారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ అందించారు. దర్శకేందురు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి అనే నూతన దర్శకురాలు ఈ సినిమాని రూపొందిస్తుంది. ఆర్.కే ఫిలిమ్స్ మరియా ఆర్కా మీడియా బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని హరి చరణ్, శ్వేతా పండిట్ ఆలపించారు. ఈ సినిమాతో పెళ్లి సందడి అంత సూపర్ డూపర్ హిట్ సాధించి రోషన్ ని హీరోగా నిలబెట్టడానికి శ్రీకాంత్ ప్రయత్నాలు చేస్తున్నాడు.