కోలీవుడ్: కోలీవుడ్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కే.వీ.ఆనంద్ గారు ఈరోజు ఉదయం మరణించారు. ఆనంద్ గుండె పోటుతో మరణించారు అని ఉదయం కథనాలు వచ్చాయి కానీ ఆయన కరోనా తో మరణించారని సాయంత్రం ధ్రువీకరించారు. హీరో సూర్య రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకి ఇవ్వడానికి హాస్పిటల్ వర్గాలు నిరాకరించాయి. సినిమాటోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఏంతో మందితో సన్నిహితంగా పని చేసిన కే.వీ.ఆనంద్ మృతికి ఎంతో మంది సినీ పెద్దలు తమ విచారాన్ని వ్యక్తం చేసారు. ‘ఒక మంచి టెక్నీషియన్ నే కాదు ఒక మంచి వ్యక్తి ని కోల్పోయాం’ అని చాలా మంది సినీ సెలబ్రిటీస్ ట్వీట్ చేసారు.
‘రంగం’, ‘వీడోక్కడే’, ‘అనేకుడు’, ‘బ్రదర్స్’ సినిమాల ద్వారా కే.వీ.ఆనంద్ తెలుగు వాళ్లకి కూడా సుపరిచుతుడే. ఈ సినిమాలతో డైరెక్టర్ గా ఇక్కడ మంచి గుర్తింపు పొందాడు. తాను డైరెక్ట్ చేసిన సినిమాలు సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి అనేది పై సినిమాలు ఒక ఉదాహరణగా చూపించవచ్చు. కే.వీ.ఆనంద్ చివరగా సూర్య తో ‘కాపన్’ తెలుగు లో ‘బందోబస్త్’ సినిమాకి దర్శకత్వం వహించారు. 54 యేళ్ళున్న కే.వీ. ఆనంద్ ఇండస్ట్రీ లో ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులతో, టెక్నిషియన్స్ తో పని చేసారు.
స్టిల్ ఫోటోగ్రాఫర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ఫోటో జర్నలిస్ట్ గా మారాడు కే.వీ.ఆనంద్. సినిమాటోగ్రఫీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ దగ్గర కొంత కాలం అసిస్టెంట్ గా పని చేసాడు. ఆ తర్వాత తానే సినిమాటోగ్రాఫర్ గా సినిమాలు తియ్యడం మొదలుపెట్టాడు. కే.వీ. ఆనంద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మొదటి సినిమా ‘తన్మవిన్ కొంబత్’ అనే మలయాళ సినిమాకి నేషనల్ అవార్డు గెలుపొందాడు. ఆ తర్వాత ఎన్నో పెద్ద సినిమాలకి పని చేసాడు.
శంకర్ రూపొందించిన ‘శివాజీ’ ,’బాయ్స్‘, ‘ఒకే ఒక్కడు’ సినిమాలకి కూడా కే.వీ. ఆనంద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. ఆ తర్వాత 2005 లో డైరెక్టర్ గా మారి 2009 లో వీడోక్కడే, 2011 లో రంగం సినిమాలతో డైరెక్టర్ గా కూడా సూపర్ సక్సెలని చూసాడు కే.వీ. ఆనంద్. మొన్ననే సీనియర్ కమెడియన్ ‘వివేక్’ మరణం ఇప్పుడు మరో మంచి టెక్నీషియన్ ‘కే.వీ.ఆనంద్’ మరణంతో తమిళ సినిమా ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురవుతుంది.