టాలీవుడ్: త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వే నువ్వే సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ గా తొలి అడుగులు వేసింది మహేష్ బాబు తో తీసిన ‘అతడు’ సినిమాతో. అప్పుడు సైలెంట్ హిట్ అనిపించుకుని టీవీ ల్లో , ఆన్లైన్ మాధ్యమాల్లో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ వెనుతిరిగి చూసుకుంది లేదు. మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన ఈ డైరెక్టర్ నుండి సినిమా వస్తుందంటే మంచి అంచనాలు ఉంటాయి. అతడు తర్వాత త్రివిక్రమ్ దగ్గరినుండి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా టెక్నికల్ గా, రైటింగ్ పరంగా ‘అతడు’ సినిమాని బీట్ చేయలేదు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.
అతడు తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ‘ఖలేజా’ అనే సినిమా వచ్చింది. కల్ట్ క్లాసిక్ గా పిలవబడే ఈ సినిమా థియేటర్లలో డిసాస్టర్ మూట కట్టుకుంది. కానీ టీవీ ల్లో వచ్చిన తర్వాత ఈ సినిమా కి అనూహ్యమైన పొగడ్తల వర్షం కురిసింది. ఇప్పటికీ ఈ సినిమా విడుదల తేదీ రోజు ఈ సినిమా ప్లాప్ ఎలా అయింది అని సోషల్ మీడియా లో డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. మహేష్ బాబు రెగ్యులర్ గా కాకుండా ఈ సినిమాలో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటాడు. సినిమా మొదటి నుండి చివరి వరకు మహేష్ బాబు మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా అనిపిస్తాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో, అల్లు అర్జున్ తో ఎక్కువ హిట్ సినిమాలు తీసినప్పటికీ మహేష్ తో తీసిన సినిమాల్లోనే కొత్తదనం చూపించాడు. ఇప్పుడు మరో సారి మహేష్ తో సినిమా తియ్యడానికి రంగం సిద్ధం అయింది. ఎన్ఠీఆర్ తో సినిమా వాయిదా పడిన తర్వాత హాసిని వారి బ్యానర్ లో త్రివిక్రమ్ చేయనున్న సినిమా మహేష్ బాబు తో అని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ముగిసిన తర్వాత ఈ సినిమా మొదలుతుంది. ఈ సినిమా 2022 వేసవి లోనే విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.