అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గం కరోనా కట్టడికి ఈ ఎల 5వ తేదీ మధ్యాహ్నం నుంచి రాష్ట్రం మొత్తం పగటి పూట కర్ఫ్యూ అమలకు కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది.
ఈ క్రమంలో ఇవాళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో రేపటి నుండి పగటి పూట కర్ఫ్యూ అమలుతో పాటు పలు అంశాల పై చర్చ సాగింది. రేపటి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు కూడా తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉ.6 గంటల నుంచి మ.12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు ప్రైవేటు వాహనాల రాకపోకలపై కూడా నిషేధం విధించింది, అంతరాష్ట్ర సర్వీసులు కూడా రద్దు అవుతాయని తెలిపింది.
మే 13న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతుందని తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు లబ్ధి జరగనుంది. మే 25న వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా నగదు జమ. దీని వల్ల 38 లక్షల మంది రైతులకు లబ్ధి జరగనుంది. మే 18న వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా నగదు జమ. వేటకెళ్లే మత్స్యకారులకు రూ.10వేల చొప్పున సాయం పథకాలు అమలు జరగనున్నాయి.
7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్ ఆమోదం. రాష్ట్రవ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకారం. పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన అమలులోకి రానుంది.
ప్రైవేట్ యూనివర్శిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాకు ఇవ్వాలి. ఆ సీట్లకు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు ప్రభుత్వమే ఇస్తుంది అన్నారు. ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకివ్వడానికి నిర్ణయం. 708 గ్రామాల్లో అమూల్ సేవలు.
రాష్ట్రంలో కరోనా టెస్టు చేసిన 24 గంటల్లోనే రిపోర్ట్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో 26వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు కోటి 67వేల మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రతి మండల కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాం.
కర్ణాటక, ఒడిశా, చెన్నై, విశాఖ నుంచి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం. రెమిడెసివిర్ ఇంజక్షన్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాం’’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘‘కోవిడ్ కట్టడికి ప్రజలు స్వీయనిర్బంధం పాటించాలి. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. 45 ఏళ్లు పైబడ్డ వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.