టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించ దగ్గ దర్శకుల్లో దాసరి నారాయణరావు గారు ఒకరు. ఎందరో దర్శకులకు ఆయన ఆదర్శం. ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతో మంది దర్శకులు ఇండస్ట్రీ కి వచ్చారు. ఆయన దర్శకుడిగా కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా విప్లవ సినిమాలు, ఎమోషనల్ సినిమాలు, సెంటిమెంట్ తో పాటు మంచి మెసేజ్ సినిమాలు రూపొందించి ఇండస్ట్రీ గొప్పతనానికి ఎంతో కృషి చేసారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ లో డైరెక్టర్స్ డే జరుపుకుంటారు.
కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా మెప్పించాడు. 300 సినిమాలకు సంభాషణలు అందించాడు, 250 పైగా సినిమాలకి దర్శకత్వం వహించారు, 50 కి పైగా సినిమాలకి నిర్మించారు. ఇప్పుడు ఉన్న ఎంతో మంది సీనియర్ నటులు ఆయన శిష్యులం అని చెప్పుకుంటారు. ఆయన చివరి క్షణం వరకు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించి చిన్న సినిమాల మనుగడ కోసం ఎంతో శ్రమించారు. దాసరి గారి సినిమాల్లో ‘కంటే కూతుర్నే కనాలి’, ‘మేఘ సందేశం’ సినిమాలకి స్పెషల్ జ్యూరీ మరియు ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డు లబింధించి. ఇవి గాక 15 సార్లు నంది పురష్కారాన్ని, 4 సార్లు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని స్వీకరించారు దాసరి గారు.
ఈ రోజు దాసరి గారి పుట్టిన రోజు సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి గారు దాసరి నారాయణ రావు గారిని స్మరించుకుంటూ ఇండస్ట్రీ గర్వించ దగ్గ దర్శకుడికి ఇప్పటికీ ప్రభుత్వ గుర్తింపు రాకపోవడం ఒక లోటు అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ లో ఎంతో గొప్పవిజయాలని అందించిన మహానుభావుడిని ఇప్పటికైనా పద్మ పురస్కారం అందించాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ అది చిత్ర పరిశ్రమకి దక్కే గౌరవం గా పేర్కొన్నారు.