టాలీవుడ్: కరోనా సమయంలో ప్రభుత్వమే కాకుండా అందరూ తమకి తోచిన విధంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ విషయంలో మొదటి నుండి సోనూ సూద్ చూపించిన ఇంపాక్ట్ కి ప్రజలందరి నుండి నేషనల్ హీరో స్థాయికి చేరుకున్నాడు. తాను స్వయంగా కరోనా బారిన పడినా కూడా ఎక్కడా సహాయ చర్యలు ఆగకుండా చూసుకున్నాడు. చిరంజీవి టాలీవుడ్ లో కరోనా క్రైసిస్ చారిటీ ని స్థాపించి సినీ కార్మికుల్ని ఆదుకున్నాడు. ఇపుడు సెకండ్ వేవ్ లో కూడా వాక్సిన్లు ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పిస్తున్నాడు.
సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో వాక్సిన్లు, ఆక్సిజన్ లు దొరకడం కష్టం గా ఉన్నసమయంలో హైదరాబాద్ కోఠి లోని ఒక హాస్పిటల్ లో నీళ్లు కూడా దొరకడం కష్టం గా మారింది. ఇది తెలుసుకున్న అడవి శేష్ వెంటనే 850 లీటర్ల వాటర్ బాటిల్స్ ని హాస్పిటల్స్ కి పంపించాడు. ఇంకా మున్ముందు కూడా ఆ హాస్పిటల్ నీటి సమస్యని తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు.
మరొక యువ హీరో సందీప్ కిషన్ ఇంకో రకంగా కరోనా బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కరోనా సమయంలో ఎంతోమంది తల్లి తండ్రుల్ని కోల్పోయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికి శాశ్వత పరిష్కారం లేదా బెటర్ లైఫ్ దొరికే వరకు వాళ్ళ కనీస అవసరాలైన తిండి , బట్టలు లాంటివి సమకూరుస్తానని అలా ఎవరైనా ఉంటే వాళ్ళ వివరాలని తమ సంస్థకి తెలియ చేయాలనీ తెలిపాడు.
ఇలా నిర్మాణ సంస్థలు, పెద్ద హీరోలు, యువ హీరోలు తమకి తోచిన విధంగా తమ తోచినంతగా ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బాధితుల్ని ఆదుకోవడం ఆనందం కలిగించే విషయం.