కరోనా – పేరులో పాజిటివ్ ఉన్నాకూడా ఈ మిలీనియం లో ట్రేండింగ్ ఐన నెగటివ్ పదం గా మొదటి స్థానం లో ఉంటుంది. ఈ వైరస్ వల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ దేశం, ప్రతీ రంగం చాలా రకాలుగా నష్టపోయింది. కొన్ని దేశాలు కోలుకున్నా, కొన్ని దేశాలు అలవాటు పడినా, కొన్ని దేశాలు ఇదిగో మందు అదిగో మందు అని చెప్తూ వస్తూ ఉన్నా కూడా దీనికి ఇప్పుడే అంతం అయితే కనపడడం లేదు. ఈ సంక్షోభం లో నష్టపోయిన ఒక రంగం సినిమా. చాల మందికి చాలా రకాలుగా వివిధ మార్గాల్లో ఉపాధి కల్పించే సినిమా రంగం కరోనా తాకిడికి కుదేలయింది. సినిమాని నిర్మించి థియేటర్ లో రిలీజ్ చేసి మంచి పేరు లేదా కొంత డబ్బు సంపాదించుకుందాం అని పెట్టుబడులు పెట్టిన నిర్మాతలకి కరోనా వల్ల మొండిచెయ్యే దక్కింది. ఇదే సమయం లో ఓటీటీ రూపం లో కొంతవరకు వాల్లకి రిలీఫ్ దొరికింది. ఇప్పుడు చిన్న సినిమాలకి ఓటీటీ ఆశాదీపం లాగ కనిపిస్తుంది. ఇప్పటివరకి పెద్ద సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవకపోయినప్పటికీ కొన్ని చిన్న సినిమాలకి థియేటర్ లో రిలీజ్ చేసినా కూడా రానంత పబ్లిసిటీ ఓటీటీ ద్వారా వచ్చాయి.
ఇప్పటికే కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అయ్యి మిశ్రమ స్పందనతో నడుస్తుంది. ఇవాళే నెట్ ఫ్లిక్ లో ‘కృష్ణ అండ్ హిస్ లీల’ అనే తెలుగు సినిమా విడుదల అయింది. బోల్డ్ కంటెంట్ టాల్క్ తో ఒక వర్గం వరకే ఈ సినిమా పరిమితం అయింది. దీనితో పాటు ఇంకా కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ లైన్ లో ఉన్నాయి. నవీన్ చంద్ర నటించిన ‘భానుమతి రామకృష్ణ’, అదితి రావు హైదరి నటించిన ‘సూఫీయుమ్ సుజాతయుమ్’ అనే మళయాళ సినిమా, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తమిళ సినిమా ‘డాన్నీ’ , మమ్ముట్టి నటించిన ‘షై లాక్’ ఇలా చూసుకుంటూ పోతే లిస్ట్ లో ఇవి కాకుండా ఇంకా చాలా సినిమాలే ఓటీటీ ఖాతాలో పడేట్లు ఉన్నాయి.