టాలీవుడ్: కరోనా టైం లో ఇబ్బంది పడని వాళ్ళు లేరు. పోయిన సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ ఇండియా లో అంత బలంగా లేదు కానీ సెకండ్ వేవ్ మాత్రం జనాల జీవితాల్ని అస్తవ్యస్తం చేసింది. కళ్లెదురుగానే ఎంతోమంది అయిన వాళ్ళని కోల్పోతుంటే ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో అందరూ తమకి తోచిన విధంగా సహాయ పడుతూ , జనాలకి అవేర్ నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్న RRR టీం కూడా బహుభాషల్లో ఒక అవేర్ నెస్ వీడియో క్రియేట్ చేసి విడుదల చేసింది.
ఈ వీడియో లో అలియా భట్, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ , అజయ్ దేవగన్, ఎస్.ఎస్. రాజమౌళి తమ సందేశాన్ని వివిధ భాషల్లో తెలియచేసారు. ఇలాంటి సమయాల్లో అందరూ మాస్క్ ధరించండని, వాక్సిన్ అందుబాటులోకి రాగానే ఎలాంటి సందేహం లేకుండా వాక్సిన్ వేయించుకొమ్మని సందేశం ఇచ్చారు. ఇపుడున్న పరిస్థితుల్లో వాక్సిన్ మాత్రమే మనల్ని రక్షిస్తుందని తెలియచేసారు. మీతో పాటు మీ మిత్రులకి , శ్రేయోభిలాషులని కూడా వాక్సిన్ వేయించుకోవడానికి ఎంకరేజ్ చేయండని చెప్పారు. ఇది మనకోసం , మన వాళ్ళకోసం – తప్పని సరిగా వాక్సిన్ వేయిన్చుకోండి, మాస్క్ ధరించండి అని తెలిపారు.
ఈ వీడియో లో అలియా భట్ తెలుగులో, రామ్ చరణ్ తమిళ్ లో, జూనియర్ ఎన్టీఆర్ కన్నడ లో, అజయ్ దేవగన్ హిందీ లో, డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మలయాళం లో తమ సందేశాన్ని తెలిపారు. ఇలా పాన్ ఇండియా మూవీ కి తగ్గట్టుగానే అవేర్ నెస్ కూడా బహుభాషల్లో ఒకేసారి క్రియేట్ చేసారు RRR టీం.