న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ రోజు రోజుకు భయంకరంగా విజృంభిస్తూనే ఉంది. రెండో దశ ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు. దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు మహమ్మారిని కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు.
దేశంలో మళ్ళీ నాలుగు లక్షలకు పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 4,14,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,915 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
ఈ నూతన కేసులతో సంఖ్యతో కలిపి మొత్తం దేశంలోని కేసుల సంఖ్య 2,14,91,598 కు చేరుకుంది. కాగ కరోనా నుంచి కోలుకుని ఇప్పటి దాకా మొత్తం 1,76,12,351 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. 2,34,083 మంది మృతి చెందారు.
అయితే ప్రస్తుతం దేశం మొత్తం మీద 36,45,164 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఒక్క భారతదేశం లోనే 49 శాతం కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.