న్యూఢిల్లీ : కరోనా కు చిన్న పెద్ద తేడా లేదు, ఉన్న వాడు లేని వాడు అని తేడా లేదు. అందరినీ సమానంగా దాడి చేస్తోంది. ఈ కరోనా సెకండ్ వేవ్ లో మరణాల రేటు ఎక్కువ గా ఉంది. దీని దెబ్బ కు ఎందరో సినిమా తారలు, రాజకీయ నాయకులు, సామాన్యులు అందరూ మృత్యువాత పడుతున్నారు.
తాజాగా అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కూడా కరోనా బారిన పడి మృతి చెందారు. ఆయన గత కొద్దిరోజులుగా వైరస్‌తో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ శుక్రవారం మృత్యువాత పడ్డారు.
ఈయన మీద దాదాపు 70కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. తొలుత దావుద్ అనుచరుడిగా ఉన్న రాజన్, దావుద్‌తో వచ్చిన విబేధాల కారణంగా మరో కొత్త గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.