fbpx
Sunday, November 17, 2024
HomeLife Styleవ్యాక్సిన్ వేసుకున్న తరువాత పాజిటివ్ వచ్చే అవకాశం ఎంత?

వ్యాక్సిన్ వేసుకున్న తరువాత పాజిటివ్ వచ్చే అవకాశం ఎంత?

COVID-INFECTION-AFTER-VACCINATION-IS-OF-LESS-CHANCE

ఢిల్లీ: యావత్ ప్ర‌పంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 ఇంకా తన ప్రభావం చూపిస్తూనే ఉంది. గత కొన్ని నెలల క్రితం తగ్గినట్టే తగ్గి మళ్ళీ మన దేశంలో నెల రోజుల నుండి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలు దీని క‌ట్ట‌డి కోసం వ్యాక్సిన్ల‌ను అభివృద్ధి చేయడం లేదా వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాయి.

కాగా భార‌త్ లో ఇప్పటికే స్వదేశంలో భారత్ బ‌యోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌, మరియు సీరం ఇంస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్‌కు అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి లభించింది. ప్ర‌స్తుతం మన దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ కొన‌సాగుతోంది.

కానీ ఇటీవల వ్యాక్సిన్ వేసుకున్న త‌ర్వాత కూడా కొంతమంది ఈ వైరస్ బారిన ప‌డుతున్న సంగతి చూస్తూనే ఉన్నాము. అందువల్ల ప్రజలలో వ్యాక్సిన్ ప‌ని తీరుపై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇలా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఈ కోవిడ్ బారిన ప‌డుతున్న‌ప్పుడు, వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఎంతవరకు అవసరం అని ప్ర‌శ్నిస్తున్నారు.

కాగా ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన అతి ముఖ్య‌మైన విషయం ఏంటంటే వ్యాక్సిన్ అనేది కోవిడ్ సోకకుండా అడ్డుపడదు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న శ‌రీరంలోకి వైరస్ ప్ర‌వేశించిన‌ప్పుడు యాంటీబాడీస్ వైరస్ తో పోరాడటంతో పాటు, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజ‌ప‌రిచి వైర‌స్ ఇత‌ర క‌ణాల‌కు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది.

అన్నింటికంటే ముఖ్యంగా ఇది ప్రాణాంత‌క ప‌రిస్థితి నుంచి వ్యక్తిని కాపాడుతుంది. ఇక ఈ వ్యాక్సిన్ రెండు డోసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయ‌డానికి దాదాపుగా 45 రోజుల స‌మ‌యం ప‌డుతుంది అని నిపుణుల అంచనా. ఈ లోపు వైర‌స్ బారిన ప‌డితే, త్వ‌రగానే కోలుకుంటారు త‌ప్ప వారి ప్రాణాలు పోయే ప‌రిస్థితులు తక్కువ అని నిపుణుల అభిప్రాయం.

కాగా మన దేశంలో వినియోగిస్తున్న కోవాగ్జిన్‌, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్న త‌ర్వాత పాజిటివ్ రేటు ఎలా ఉంది అంటే:

కోవిషీల్డ్‌:
మన దేశంలో మ‌న దగ్గ‌ర 10,03,02,745 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫ‌స్ట్ డోసు తీసుకోగా, వీరిలో కేవ‌లం 17,145 (0.02శాతం) మంది మ‌త్రామే టీకా ఫ‌స్ట్ డోస్ త‌ర్వాత క‌రోనా బారిన ప‌డ్డారు. ఇక కోవిషీల్డ్ సెకండ్ డోస్ తీసుకున్న వారు 1,57,32,754 కాగా, వీరిలో 5,014(0.03 శాతం) మంది మాత్ర‌మే రెండో డోసు త‌ర్వాత వైర‌స్ బారిన ప‌డ్డారు.

కోవాగ్జిన్‌:
ఇప్పటి వరకు 93,56,436 మంది కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ ఫ‌స్ట్ డోసు తీసుకోగా, వీరిలో కేవ‌లం 4,208(0.04శాతం) మంది మ‌త్రామే టీకా ఫ‌స్ట్ డోస్ తీసుకున్న త‌ర్వాత క‌రోనా బారిన ప‌డ్డారు. ఇక కోవాగ్జిన్‌ సెకండ్ డోస్ తీసుకున్న వారు 17,37,178 కాగా, వీరిలో 695(0.04శాతం)మంది మాత్ర‌మే రెండో డోసు త‌ర్వాత వైర‌స్ బారిన ప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular