ముంబై: జాతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజైన ఈరోజు కూడా లాభాలతోనే ముగించాయి. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ మొదట్లోనే సానుకూలంగా మొదలైన సూచీలు రోజు మొత్తం లాభాల బాటలోనే పయనించాయి. మధ్యాహ్న సెషన్ కు కాస్త జోరు తగ్గినా చివరి గంటలో తిరిగి పుంజుకుని వారాన్ని పటిష్ట లాభాలతో ముగించింది.
సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 49,206 వద్ద మరియు నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 14,823 వద్ద స్థిరపడ్డాయి. మెటల్, ఫైనాన్షియల్, టెలికామ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కమాడిటీ ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో టాటా స్టీల్, హిండాల్కో ,జెఎస్డబ్ల్యు స్టీల్‌తో సహా మెటల్ షేర్లు అన్నీ ఈ రోజు లాభాలు కురిపించాయి.
4వ క్వార్టర్ ఫలితాల సందర్భంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.5 శాతం ఎగిసింది. ఈ క్వార్టర్లో 42 శాతం పెరిగి 3,180 కోట్ల లాభాలను గడించింది. బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ జంట షేర్లు, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు కూడా ఇవాళ లాభాలు సాధించాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు మాత్రం ఇవాళ నష్టాలను నమోదు చేశాయి.