టాలీవుడ్: ఒక సినిమాని ప్రమోట్ చేయడం లో ఆర్జీవీ ని మించినోడు లేదు అని చెప్పుకోవడం లో సందేహం లేదు. కేవలం తన ట్వీట్స్ తోనే దాదాపు సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. కొందరు నిర్మాతలు ప్రమోషన్స్ కోసం కోట్లలో ఖర్చు పెడుతుంటే లక్షల్లో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఆర్జీవీ దావూద్ ఇబ్రహీం నేపథ్యం లో ‘D కంపెనీ’ అనే సినిమా రూపొందించారు. వచ్చే వారం ఈ సినిమా విడుదల అవనుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఈ సినిమా మొదటి 4 నిమిషాల వీడియో ని విడుదల చేసారు ఆర్జీవీ.
ఈ వీడియో లో టైటిల్ తో పాటు ముంబై నగరం లో దావూద్ గ్యాంగ్ ని ప్రారంభించడం లో తొలి అడుగులు ఎలా వేసాడు అనేవి చూపించారు. ఈ సినిమా ఆరంభానికి కారణం అయిన ఒక బార్ సిట్టింగ్ వరకు తీసుకువచ్చి వీడియో ముగించాడు. సినిమాలో ఆర్జీవీ స్టైల్ అఫ్ టేకింగ్ , కెమెరా యాంగిల్స్ తెలుస్తున్నాయి. ఇదివరకు కూడా ఆర్జీవీ ’26 /11 ముంబై అట్టాక్స్’ కి సంబందించిన సినిమాకి కూడా మొదటి 7 నిమిషాల వీడియో ని విడుదల చేసి ప్రొమోషన్ చేసారు. మే 15 న ఈ సినిమా స్పార్క్ ఓటీటీ లో విడుదల అవనుంది.