టాలీవుడ్: అక్కినేని హీరో నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా విడుదలకి సిద్ధం చేసారు. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం మరో సినిమాని విడుదలకి సిద్ధం చేసే పనిలో ఉన్నాడు చైతూ. కరోనా టైం లో కూడా ఈ సినిమా షూటింగ్ తగు జాగ్రత్తలతో పూర్తి చేస్తున్నారు. అక్కినేని ఫామిలీ కి మరచిపోలేని హిట్ అందించిన ‘మనం’ దర్శకుడు విక్రమ్.కే.కుమార్ దర్శకత్వంలో ‘థాంక్ యు’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా కోసం ఈ మధ్యనే ఈ సినిమా టీం ఇటలీ కి వెళ్ళింది.
అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవం అని తెలియచేస్తూ ఈ రోజు ఈ సినిమా టీం ఇటలీ షూట్ పూర్తి అయింది అని ట్వీట్ చేసి తెలియచేసారు. ఈ సినిమాలో చైతు కి జోడి గా రాశి ఖన్నా నటిస్తుంది. మంచి రైటర్ గా గుర్తింపు పొందిన బి.వీ.ఎస్. రవి ఈ సినిమాకి కథ మరియు మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాకి అవార్డు విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ ‘పి.సి.శ్రీరామ్‘ డీవోపీ గా పనిచేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ట్రెండింగ్ కంపోజర్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.