టాలీవుడ్: తెలుగులో ఓటీటీ ఆదరణ పెరుగుతున్న తరుణంలో మొదటి లాక్ డౌన్ సమయం లో ఆహా ఓటీటీ లో ‘కంబాలపల్లి కథలు – మెయిల్ ‘ అనే వెబ్ మూవీ విడుదల అయింది. ఈ సిరీస్ అఫ్ సినిమాల్లో మొదటి సినిమా గా ‘మెయిల్’ అని రూపొందించారు. మొదటి సినిమా ‘మెయిల్’ విపరీతమైన ఆదరణకు నోచుకుంది. అప్పుడప్పుడే కంప్యూటర్లు జనాలకి పరిచయం అయితున్న రోజుల్లో వూర్లో కంప్యూటర్లని జనాలు ఎలా వాడడం మొదలు పెట్టారు అనే అంశాన్ని రియాలిటీ కి చాలా దగ్గరగా హ్యూమరస్ కోణం లో రూపొందించి అద్భుతమైన సక్సెస్ సాధించారు.
ఐతే ఈ ఇబ్బంది కరమైన కరోనా టైం లో ఒక మంచి మెయిల్ వచ్చింది . అది మీకు తెలియచేసున్నాం అని ఈ సినిమాని నిర్మించిన స్వప్న సినిమా వారు తెలిపారు. న్యూ యార్క్ లో జరగననున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కి ‘కంబాలపల్లి కథలు – మెయిల్ ‘ సినిమాని ఎంపిక చేసినట్టు తెలిపారు. జూన్ 4 నుండి ప్రారంభం అవుతున్న ఈ ఫెస్టివల్ లో ఎన్నో బాషల నుండి మంచి మంచి సినిమాలు ప్రీమియర్ వేస్తారు. ఈ సినిమా కూడా ఇలా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో ప్రీమియర్ అవడం ఆనందంగా ఉన్నట్టు ఈ సినిమా నిర్మాతలు తెలియచేసారు.