హైదరాబాద్ : కోవిడ్ రెండవ వేవ్ దెబ్బకు దేశం మొత్తం ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అవసరం ఎక్కువయింది. దీనివల్ల సహజంగా ఆక్సిజన్ సిలిండర్లకు అనుకోకుండా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ కావల్సినంత ఉత్పత్తి లేక ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు ఎక్కడా జరగడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులైన నిమ్స్, అపోలో వంటి ఆస్పత్రుల నుంచి ఆక్సిజన్ సరఫరా కోసం అభ్యర్థనలు వెల్లువెత్తాయి, అలా వచ్చిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను భారీ స్థాయిలో ఉచితంగా సరఫరా చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
ఆక్సిజన్ సమికరణ కోసం భద్రాచలంలోని ఐటీసీ, హైదరాబాద్‌లోని డిఆర్‌డివోతో ఆఘమేఘాల మీద ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దేశంలో కరోనా కేసులు పెరిగడంతో కోవిడ్ రోగులు ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సరైన సమయంలో కావాల్సినంత ఆక్సిజన్ అందక రోజుకు కొన్ని వందల మంది కోవిడ్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల సహకారంతో ఆక్సిజన్ అవసరమయ్యే అన్ని హాస్పిటల్స్‌కు ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ప్రభుత్వం సహకారంతో వివిధ హాస్పిటల్స్ కు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయనుంది.