టాలీవుడ్: ఇప్పుడున్న హీరోయిన్లలో ఈ సినిమాలో ఈ హీరోయిన్ నటించింది అంటే హీరోయిన్ పేరు చూసుకుని వెళ్లే హీరోయిన్లలో సాయి పల్లవి ముందుంటారు. అది కూడా గ్లామర్ కోసం కాకుండా తన నటనని స్క్రీన్ ప్రెజన్స్ ని ఎంజాయ్ చేయడానికి. తాను తీసిన సినిమాలు తన నుండి ఇక ముందు వస్తున్న సినిమాలే అందుకు ఉదాహరణ. ఈ రోజు సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమా నుండి సాయి పల్లవి ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా టీం. ఈ సినిమాని కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో త్రిశూలం పట్టుకున్న కాళీ మాత అవతారంలో సాయి పల్లవి ఆకట్టుకుంది.
విజయ్ దేవరకొండ తో ‘టాక్సీ వాలా’ సినిమాని డైరెక్ట్ చేసిన ‘రాహుల్ సాంకృత్యాన్‘ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో నాని కి జోడీ గా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాలో మరొక హీరోయిన్ గా ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి కూడా నటిస్తుంది. పీరియాడిక్ కథ తో రూపొందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన నాని లుక్ కొత్తగా ఆకట్టుకుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిక్కీ జ్ మేయర్ సంగీత దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.