టాలీవుడ్: ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఎంతో కొంత కొత్తదనం లేకపోతే స్టార్ హీరో సినిమా అయినా జనాలు తీసి పారేస్తున్నారు. కొంచెం రొటీన్ అనిపించినా, పాత సినిమాలు పోలికలు అనిపించినా నిర్మొహమాటంగా సినిమాని ప్లాప్ చేసేస్తున్నారు. అందుకే కొత్తదనంతో వచ్చే చిన్న సినిమాలకి ఆదరణ పెరుగుతుంది. ఓటీటీ లు కూడా అందుబాటులోకి రావడం తో కొన్ని చిన్న సినిమాలకి మంచి అవకాశం తో పాటు ఆదరణ పెరుగుతుంది. అలాంటి ఒక ప్రయత్నం తో ‘సినిమా బండి’ అనే సినిమా మన ముందుకు రాబోతుంది. బాలీవుడ్ లో కొన్ని మంచి సినిమాలతో పేరు తెచ్చుకున్న ‘రాజ్ అండ్ డి.కే‘ ద్వయం నిర్మాతలుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం ‘సినిమా బండి’ అనే సినిమాని నిర్మించారు.
ఆటో నడుపుకునే ఒక ఆటో డ్రైవర్ తన ఆటో లో దొరికిన కెమెరా తో అసలు అది ఎలా పనిచేస్తుందో తెలియకుండానే దానితో సినిమా ఎలా తీస్తాడు అనేది సినిమా కథ. ఈ సినిమా ప్రొమోషన్ కోసం సినిమా టీం ప్రొమోషన్ సాంగ్ విడుదల చేసింది. నేటివ్ భాషలో సినిమా తియ్యడానికి పడ్డ కష్టాలని రాప్ రూపంలో రూపొందించిన ఈ పాట ఆకట్టుకుంది. ‘సినిమా తీసినం’ అంటూ సాగే ఈ పాటని ‘రోల్ రైడా’ డైరెక్టర్ ‘తరుణ్ భాస్కర్’ ఆలపించారు. శిరీష్ సత్యవోలు, వరుణ్ రెడ్డి సంగీతంలో ఈ సినిమా రూపొందింది. ప్రవీణ్ కేంద్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 14 మే 2021 న నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో విడుదల అవనుంది.