టాలీవుడ్: ‘హృదయ కాలేయం’ అనే సినిమాతో సర్కాస్టిక్ కామెడీ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు సంపూర్ణేష్ బాబు. తనని తాను బర్నింగ్ స్టార్ గా పరిచయం చేసుకుని సర్కాస్టిక్ కామెడీ తో గుర్తింపు తెచ్చుకుని ఒక రెండు మూడు సినిమాలు పరవాలేదనిపించాడు. ఒక వర్గం ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసినా కానీ చాలా మంది మాత్రం ఈ సినిమాలని విమర్శించారు. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు దగ్గరి నుండి పెద్దగా సినిమాలు రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు ప్రకటనలు రావడం తప్ప ఆ సినిమాల గురించి అప్ డేట్ మాత్రం ఏమి లేవు.
చివరగా కొబ్బరి మట్ట అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇది కూడా సర్కాస్టిక్ కామెడీ సినిమాగానే రూపొందింది. ఈ రోజు సంపూర్ణేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమా ప్రకటించాడు. ‘కాలీ ఫ్లవర్’ అంటూ సినిమా పేరుని ప్రకటించి మరోసారి వెటకారపు కామెడీ తోనే రానున్నట్టు హింట్స్ ఇచ్చారు. ‘ మహాత్మా గాంధీ, సర్ ఆర్థర్ కాటన్ లాంటి గొప్పవాళ్ళు ఆ కాలంలో వారి పనికి గొప్ప పేరు సంపాదించారు. కానీ భారత స్త్రీ పవిత్రత చాటి చెప్పడానికి ప్రయత్నించినా కాలీ ఫ్లవర్ గురించి మాత్రం చరిత్ర మరిచిపోయింది అందుకు చరిత్ర సిగ్గు పడుతుంది’ అని ఒక చిన్న వీడియో బైట్ కూడా విడుదల చేసారు. ‘శీలో రక్షతి రక్షిత’ అనే టాగ్ లైన్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా అయినా కేవలం ప్రకటనకు కాకుండా రూపుదిద్దుకుని విడుదల అవుతుందని ఆశిద్దాం.