టాలీవుడ్: ఫిదా సినీమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన నటి సాయి పల్లవి. గ్లామర్ కాదు నటనతో, స్క్రీన్ ప్రెజన్స్ తో అభిమానుల్ని సంపాదించుకోవచ్చు అని నిరూపించింది ఈ అమ్మాయి. తాను తీసే ప్రతీ సినిమాలో తన గ్లామర్ కోసం కాకుండా కథని బేస్ చేసుకుని సినిమాలు ఎంచుకునే హీరోయిన్లలో సాయి పల్లవి ముందుటారు. ఇపుడు ఇండస్ట్రీ లో కొన్ని హీరోయిన్ యాక్టింగ్ స్కోప్ ఉన్న కథలకి దర్శకుల ఫస్ట్ ఛాయిస్ సాయి పల్లవి అనడంలో అతిశయోక్తి ఏమి లేదు.
సాయి పల్లవి ప్రస్తుతం నటించిన రెండు సినిమాలు విడుదలకి సిద్ధం గా ఉన్నాయి. ఏప్రిల్ లో ఈ రెండు సినిమాలు విడుదల అవ్వాల్సి ఉంది కానీ కరోనా వల్ల వాయిదా వెయ్యాల్సి వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ‘సారంగ దారియా’ అనే పాటతో ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది సాయి పల్లవి. ఈ పాటలో తన ఎక్స్ప్రెషన్స్, తన డాన్స్ తో ఆకట్టుకుంది. దీనితో పాటు విడుదలకి సిద్ధం అయిన మరొక సినిమా ‘విరాట పర్వం’ 1990 ల్లో జరిగిన నక్సలైట్ కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో రానా పాత్ర కన్నా సాయి పల్లవి పాత్ర చాలా బాగుంటుందని అందుకే సినిమా పోస్టర్ లో కూడా సాయి పల్లవి పేరే ముందుంటుందని ఒక ఇంటర్వ్యూ లో కూడా రానా తెలిపారు.
ఇపుడు ఉన్న కరోనా పరిస్థితుల్లో తన పోస్టర్ విడుదల చేయడం నచ్చక చేయడం లేదని విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల సినిమా నుండి ఒక పిక్ విడుదల చేసారు. సాయి పల్లవి నటిస్తున్న మరో సినిమా ‘శ్యామ్ సింఘరాయ్‘. నాని తో ఈ సినిమాలో నటిస్తుంది పల్లవి. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈరోజు విడుదల చేసారు. తన అద్భుతమైన నటనతో ఇంకా మరెన్నో సినిమాలతో మనల్ని మెప్పించాలని ఆశిద్దాం.