హైదరాబాద్: డిజిటల్ ఇండియా భాగంగా జరుగుతున్న సాంకేతికతలో గ్రేటర్ నగరం శరవేగంగా ముందుకు వెళ్తోంది. ఇంటర్నెట్ ఆధారిత సమాచార వినియోగంలో ముందుగా ఉండే గ్రేటర్ నెటిజన్లు ఈ విషయంలో స్పీడు చాలా ఎక్కువగ దూసుకెళ్తున్నారు.
ప్రస్తుతం దేశం మొత్తం మీద కరోనా విజృంభణ కారణంగా భాగ్యనగరం పరిధిలోని వందలాది సాఫ్ట్ వేర్, బీపీఓ, కేపీఓ కంపెనీలు వారి ఉద్యోగులలో వేలాది మందికి వర్క్ ఫ్రం హోంకు అవకాశాన్ని ఇచ్చాయి. ఇంకో వైపు మెజారిటీ నగరవాసులు అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుండి బయటకు కదలడం లేదు. దీంతో ఇంటర్నెట్ వినియోగం చాలా ఎక్కువయింది.
ఇంట్లో ఉద్యోగులు, విద్యార్దులు, గృహిణులు అనే తేడా ఏ మాత్రం లేకుండా అందరూ నెట్ ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ స్పీడ్ ఉండే ఇంటర్నెట్ కంటే, ఇప్పుడు హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగానికే గ్రేటర్ సిటీజన్లు ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా అధ్యయనంలో తేలింది.
దేశవ్యాప్తంగా డిజిటల్ ఇండియా శకం సృష్టించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు 2021 చివరి నాటికి దేశంలో సుమారు 82 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
హైస్పీడ్ ఇంటర్నెట్ అంటే 60,100 ఎంబీపీఎస్ వేగం ఉన్న ఇంటర్నెట్, సాధారణ 2.5 ఎంబీపీఎస్ నెట్కంటే 400 రెట్లు అధిక సామర్థ్యం,వేగం ఉంటుందని, కావాల్సిన సమాచారం డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు పది నిమిషాల వ్యవధిలో ఏకంగా అత్యంత స్పష్టత,భారీ నిడివిగల 10 హెచ్డీ(హై డిఫినిషన్) వీడియోలను డొన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది.
గ్రేటర్లో 5 మెగాబైట్స్ పర్ సెకన్, ఒక గెగా టైట్ పర్ సెకన్ స్పీడున్న నెట్వినియోగానికి అయ్యే ఖర్చు ఇతర మెట్రోనగరాలతో పోలిస్తే తక్కువేనని వెల్లడించింది.