టాలీవుడ్: ఒకప్పుడు సౌత్ సినిమా అంటే తమిళ్ సినిమా అన్నట్టే ఉండేది. కాల క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా పేరుగాంచింది. ఒక రకంగా బాలీవుడ్ స్థాయికి దాదాపు చేరింది అని చెప్పుకోవచ్చు. తెలుగు నుండి పాన్ ఇండియా స్టార్ లు, పాన్ ఇండియా సినిమాలు బాగానే రూపొందుతున్నాయి. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా అవార్డు సినిమాలు కూడా టాలీవుడ్ లో బాగానే రూపొందుతున్నాయి. బాహుబలి తర్వాత టాలీవుడ్ స్టార్స్, సినిమాల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇప్పుడున్న హీరోల్లో టాప్ లీగ్ లో ఉంది ఎవరు అంటే ప్రభాస్ అని వెంటనే చెప్పెయ్యొచ్చు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ అలాగే, కే.జి.ఎఫ్ ద్వారా పేరు తీసుకున్న కన్నడ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’ ప్రభాస్ తో సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్.ఎస్.రాజమౌళి కంటే ముందు పాన్ ఇండియా సినిమా తియ్యగల సత్తా ఉన్న డైరెక్టర్ సౌత్ లో ఎవరు అంటే శంకర్ పేరు గుర్తుకువస్తుంది. ఇప్పటివరకు తమిళ్ లో తప్ప వేరే భాషల్లో కానీ వేరే బాషా హీరోలతో కానీ సినిమాలు తియ్యని శంకర్ మొదటి సారిగా రామ్ చరణ్ తేజ్ తో సినిమా రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ హీరోగా , దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇదివరకే మురుగదాస్ తెలుగులో చిరంజీవితో , మహేష్ బాబు తో సినిమాలు రూపొందించారు. ఇపుడు మహేష్ తో మరో సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా స్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ సినిమా రీమేక్ కోసం కోలీవుడ్ డైరెక్టర్ ‘మోహన్ రాజా’ తో పని చేస్తున్నాడు. మరో తమిళ దర్శకుడు ఎం.లింగుస్వామి ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్ పోతినేని’ తో ఒక యాక్షన్ సినిమా రూపొందించనున్నారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ విక్టరీ వెంకటేష్ తో ‘దృశ్యం 2 ‘ సినిమాని సిద్ధం చేసాడు.
ఇలా పరభాషా దర్శకులు అందరూ తెలుగు సినిమా హీరోలపై ఆసక్తి ని కనబరుస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగు టాప్ హీరోలతో సినిమాలు రూపొందిస్తున్నారు. కొందరు ఆల్రెడీ హిట్లు కొట్టారు మరికొందరు హిట్ లు కొట్టే దారిలో ఉన్నారు.