టాలీవుడ్: మూవీ జర్నలిస్ట్ లలో అతి కొద్దీ మందికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాంటి వారిలో టీఎన్ఆర్ ఒకరు. టీఎన్ఆర్ గా పేరు గాంచిన ఈయన పూర్తి పేరు తుమ్మల నరసింహ రెడ్డి. చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్ గా కొనసాగుతున్న టీఎన్ఆర్ ‘ఫ్రాంక్ లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్’ అనే యు ట్యూబ్ ఇంటర్వ్యూ షో ద్వారా చాలా పేరు సంపాదించాడు.ఈరోజు ఈయన కరోనా వల్ల మరణించారు. ఈ మధ్యన తన సిస్టర్ కి కరోనా సోకడం ఆ తర్వాత టీఎన్ఆర్ గారికి కరోనా వ్యాపించడం, కరోనా వల్ల ఆరోగ్యం విషమించడం తో ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు. ఇండస్ట్రీ లో ప్రముఖులు , ప్రెస్ లో ఎంతో మంది అభిమానులు ఈయన మృతి కి సంతాపం తెలియచేస్తున్నారు.
యూట్యూబ్ లో ‘ఐ డ్రీం’ అనే ఛానల్ లో ఈయన ఇంటర్వూస్ బాగా ఫేమస్. కొన్ని గంటల పాటు ఇంటర్వ్యూ లు తీస్కోవచ్చు అలాంటి ఇంటర్వూస్ జనాలు కూడా చూస్తారు అని ఈయన ఇంటర్వూస్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ మధ్యన సినిమాల్లో కూడా మంచి పాత్రలు వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎదో మైక్ పట్టుకుని, కొన్ని ప్రశ్నలు అడిగేసి, హోస్ట్ లని ఇబ్బంది పెట్టడం లాంటివి కాకుండా పూర్తి గ్రౌండ్ వర్క్ తో, ఇంటర్వ్యూ కి వచ్చే వాళ్ళ గురించి స్టడీ చేసి, సెన్సిబుల్ ప్రశ్నలు వేస్తూ, ఇంటర్వ్యూ చేసే వాళ్లకి గౌరవం ఇస్తూ ఇలాంటి ఇంటర్వూస్ చేయడానికి చూడడానికి బాగుంటాయి అని అందరికి ఆదర్శంగా నిలిచిన టీఎన్ఆర్ ఇక మనకి లేరు. ఎంతో మంది సినీ జర్నలిస్ట్ లకి టీఎన్ఆర్ గారు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.