అమరావతి: ఏపీ రాష్ట్రంలో కరోన కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్ కట్టడికి అనధికార లాక్డౌన్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రజలే స్వచ్చంద లాక్డౌన్ అమలు చేసుకుంటున్నారు.
ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇవాళ మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ నెలకొల్పాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. అందువల్ల ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవ్వాలని అవ్వాలని సూచించారు. కాగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను బట్టి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు.