కాన్బెర్రా: భారత్ లో కరోనా కేసులు అధికమౌతున్న వేళ ఆస్ట్రేలియా భారత్ నుంది వచ్చే విమానాలను రద్దు చేసింది. కాగా ఈ రోజు తో ఆ గడువు ముగిసింది. ఆస్ట్రేలియా ఈ నిర్ణయం పై తీవ్ర విమర్శలు తలెత్తడంతో ఈ నెల 15 నుంచి భారత్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులను తీసుకువచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
ఈ క్రమంలో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా పౌరులను తీసుకువెళ్లిన తొలి స్వదేశీయాన్ విమానం ఈ రోజు అనగా డార్విన్ చేరుకుంది. ఈ కాంటాస్ విమానం ద్వారా 80 మంది ప్రయాణికులను ఈ రోజు ఆస్ట్రేలియా చేర్చారు. ఈ విమానంలో ప్రయాణీకులు బోర్డ్ అవ్వడానికి ముందే వీరంతా రెండు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఆస్ట్రేలియా చేరిన వీరందరిని హోవార్డ్ స్ప్రింగ్స్ ప్రాంతంలో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నారు.
కాగా ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కోశాధికారి జోశ్ ఫ్రైడెన్‌బర్గ్ మాట్లాడుతూ, వైద్యుల సూచనలు పాటిస్తూ ఇక్కడి పౌరులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారత్ నుంచి తొలి విమానం రాకని తెలపడానికి ఎంతో సంతోషంగా ఉంది. వీరంతా ఆస్ట్రేలియా చేరడానికి ముందే కోవిడ్ పరీక్షలు నిర్వహించడం అతి ముఖ్యం. మేం ఇదే అనుసరించాం.
ఈ నెలలోనే మరో రెండు రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు తమ పౌరులను స్వదేశానికి తీసుకురానున్నాయి అని తెలిపారు. ఈ జూన్ వరకు 1,000 మంది ఆస్ట్రేలియా పౌరులు స్వదేశానికి చేరుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. మా ప్రభుత్వం డార్విన్ నగరానికి ఆగ్నేయంగా 25 కి.మీ (16 మైళ్ళు) దూరాన ఉన్న హోవార్డ్ స్ప్రింగ్స్‌లోని క్వారంటైన్ సెంటర్ సామార్థ్యాన్ని రెండింతలు చేయాలని నిర్ణయించుకుంది.
ఫలితంగా జూన్‌లో ప్రతి రెండు వారాలకు సుమారు 2,000 మందిని ఆస్ట్రేలియా చేర్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇక భారత్ నుంచి దాదాపు 9 వేల మంది ఆస్ట్రేలి యాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు.