కోలీవుడ్: గత సంవత్సర కాలంగా కరోనా ఎంతగా విళయ తాండవం చేస్తుందో తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం ఉన్న సెకండ్ వేవ్ మన దేశంలో మరీ ఘోరంగా ఉంది. ఈ సమయంలో సోషల్ నెట్వర్క్ ద్వారా, బ్లడ్ బ్యాంక్స్, ఆక్సిజన్ సప్లైస్, మెడిసిన్ ఇలా అన్ని రకాలుగా ఎవరికీ తోచినట్టు
వారు తమకి తోచిన సాయం చేస్తున్నారు. తమిళ నాడు లో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అక్కడి సినిమా ఇండస్ట్రీ కూడా సీఎం ఫండ్ కి నిధులు సమర్పిస్తూ సొసైటీ కి తమ వంతు బాధ్యతని నెరవేరుస్తున్నారు.
సూపర్ స్టార్ రజిని కాంత్ తన వంతుగా కోటి రూపాయలు కరోనా సాయం కోసం అందించారు. రజిని కూతురు సౌందర్య రజినీకాంత్ తన భర్త తో కలిసి మరో కోటి రూపాయలు అందించారు. హీరో సూర్య మరియు సోదరుడు కార్తీ కలిసి కోటి రూపాయల చెక్ ని ముఖ్యమంత్రి స్టాలిన్ కి అందచేశారు. మరో స్టార్ హీరో అజిత్ తన వంతుగా 25 లక్షల రూపాయలు ఈ రిలీఫ్ ఫండ్ కి అందచేశారు. మరో హీరో శివ కార్తికేయన్ 25 లక్షలు ఈ రిలీఫ్ ఫండ్ కి అందచేశారు.
కేవలం హీరోలు మాత్రమే కాకుండా డైరెక్టర్లు కూడా ఈ నిధికి బాగానే సహాయం చేస్తున్నారు. ధనూష్ తో నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్ రూపొందించిన డైరెక్టర్ వెట్రిమారన్ ఈ సహాయ నిధి కి 10 లక్షలు విరాళం అందించారు. ఎడిటర్ మోహన్, జయం రవి మరియు తెలుగు లూసిఫర్ డైరెక్టర్ మోహన్ రాజా కలిసి 10 లక్షలు విరాళం అందించారు. ఇలా తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది ఈ కరోనా సహాయ నిధికి తమ వంతుగా చేయూత అందిస్తున్నారు.