fbpx
Wednesday, January 1, 2025
HomeMovie Newsఆసక్తి రేకెత్తిస్తున్న 'మాస్టర్' విలన్ ప్రైవేట్ సాంగ్

ఆసక్తి రేకెత్తిస్తున్న ‘మాస్టర్’ విలన్ ప్రైవేట్ సాంగ్

ArjunDas LavanyaTripati PottumPogattumPromo

కోలీవుడ్: తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాల్లో విలన్ కి సమాన రోల్ చేసిన ‘అర్జున్ దాస్’ మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత మంచి ఆఫర్లు కూడా పొంది తమిళ్ లో ఇపుడు బిజీ అయిపోయాడు. ప్రస్తుతం అర్జున్ దాస్ మరియు అందాల రాక్షసి హీరోయిన్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో ఒక ప్రైవేట్ సాంగ్ రూపొందింది. ఈ పాటని మరి కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ పాట ప్రోమో చూసాక ఆసక్తి కరంగా అనిపిస్తుంది.

ఈ పాటని 2050 టైం లో రూపొందించినట్టుగా చూపించారు. మామూలుగా ఫ్లాష్ బ్యాక్ అంటే పాత టైం లో ఎలా ఉండేదో తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు సెట్స్ రూపొందిస్తాం. కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది లాంటివి కొంత క్రియేటివిటీ తో కూడుకున్నవి. ఈ పాట కూడా ఒక మంచి క్రియేటివ్ టీం తో రూపొందింది. 2028 లో చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉన్న అర్జున్ మరియు లావణ్య 2050 లో ఎలాంటి పరిస్థితుల్లో కలిసారు అనే బ్యాక్ డ్రాప్ తో ఈ పాట రూపొందినట్టు అర్ధం అవుతుంది.

థింక్ మ్యూజిక్ వారి థింక్ ఇండీ ఆర్టిస్ట్ నెంబర్ 7 – సత్య మరియు జెన్ నేతృత్వంలో ఈ పాట రూపొందింది. మద్రాస్ లోగి విగ్నేష్ ఈ పాట వీడియో ని డైరెక్ట్ చేసారు. సత్యజిత్ రవి, జెన్ మార్టిన్ ఈ పాటకి సంగీతం అందించారు. పొట్టుమ్ పోగట్టుమ్ అంటూ సాగే ఈ పాట మే 20 న విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular