బాలీవుడ్: కరోనా టైం లో ఓటీటీ లు బాగా ఫేమస్ అయ్యాయి. కానీ అంతక ముందే ఇండియా లో వెబ్ సిరీస్ లు అప్పుడప్పుడే మొదలువున్న వేళ 2019 లో అమెజాన్ ప్రైమ్ లో ‘ది ఫామిలీ మాన్’ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ విడుదల అవడం జరిగింది. ఎంతో ఉత్కంఠభరితంగా ఉన్న ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది. మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్ సూపర్ హిట్ టాక్ తో నిలిచింది. తెలుగువారైన రాజ్ నిడిమోరు మరియు డి.కే కృష్ణ ద్వయం ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా ‘ది ఫామిలీ మాన్ -2 ‘ రూపొందింది. ఈ రోజు ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేసారు.
మొదటి పార్ట్ కి కొనసాగింపు గా రూపొందిన ఈ సిరీస్ లో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి తో పాటు చాలా మంది మొదటి పార్ట్ లో ఉన్న వాళ్లే కొనసాగారు. ఈ వెబ్ సిరీస్ తో సౌత్ టాప్ యాక్ట్రెస్ సమంత వెబ్ సిరీస్ రంగంలో అడుగుపెట్టనుంది. ఈ సిరీస్ లో విలన్ షేడ్స్ ఉన్న నక్సలైట్ / టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైలర్ మొత్తం లో సర్ప్రైజ్ అంటే సమంత అని చెప్పుకోవచ్చు. ఒక సీరియస్ లుక్ , డి-గ్లామర్ లుక్ లో అదరగొట్టింది అని చెప్పుకోవచ్చు. ఈ కొత్త సిరీస్ తమిళనాడు బ్యాక్ డ్రాప్ లో రూపొందింది.
రాజ్ మరియు డీకే కృష్ణ ద్వయం నిర్మాణంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ని రాజ్, డీకే కృష్ణ తో పాటు సుమన్ కుమార్ రచన మరియు దర్శకత్వం అందించాడు. మొదటి పార్ట్ ని స్ట్రీమ్ చేసిన అమెజాన్ ప్రైమ్ సెకండ్ సీజన్ కూడా స్ట్రీమ్ చేయనుంది. ఈ సిరీస్ జూన్ 4 నుండి అందుబాటులో ఉండనుంది.