టాలీవుడ్: టెలివిజన్ లో జబర్దస్ షో గత పది సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతుంది. ఆ షో ద్వారా బాగా ఆదరణ తెచ్చుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకరు. కేవలం కామెడీ నే కాకుండా డాన్స్, యాక్టింగ్, యాంకర్ ఇలా మల్టీ టాలెంటెడ్ గా చాలా అవకాశాలే పొందుతున్నాడు సుడిగాలి సుధీర్. హీరోగా ఇదివరకే ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మరియు ‘త్రి మంకీస్’ అనే సినిమాల్లో నటించాడు. ఇపుడు హీరోగా మరో సినిమా రూపొందనుంది. ఈ రోజు సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది సినిమా టీం.
‘గాలోడు’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఒక మాస్ గెటప్ లో సిగరెట్ వెలిగించి సీరియస్ లుక్ లో సుధీర్ ని చూపించారు. సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. సుధీర్ తో ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమాని డైరెక్ట్ చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమా ద్వారా మరోసారి సుధీర్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో నటించనున్న మిగతా నటీ నటుల వివరాలు మరియు టెక్నిషియన్స్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.