కోలీవుడ్: ఇండియా నుండి ఆస్కార్ కళని నిజం చేసిన వ్యక్తి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్. 25 సంవత్సరాల క్రితం ‘రోజా’ అనే సినిమా తో సినీ ప్రయాణం ప్రారంభించి చేసిన మొదటి సినిమాకే నేషనల్ అవార్డు సాధించడం ఆయన గొప్పతనం. ఇన్ని సంవత్సరాల తర్వాత రెహమాన్ తన సొంత కథతో తన సొంత నిర్మాణంలో ఒక సినిమా రూపొందించాడు. ’99 సాంగ్స్’ అనే టైటిల్ తో ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ ఇలా బహు బాషా చిత్రంగా రూపొందించారు. పోయిన నెలలో విడుదలైన ఈ సినిమా పరవాలేదనిపించింది. ఈ సినిమాకి కూడా రహమాన్ సంగీత బ్యాక్ డ్రాప్ లో ఉండే కథని అందించాడు.
ఒక మామూలు వ్యక్తి తన తండ్రిని, తన ప్రేయసిని ఎదిరించి మ్యూజిక్ ఫీల్డ్ లో సక్సెస్ ఎలా అయ్యాడు. ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటనేది ఎమోషనల్ గా ఈ సినిమాలో చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకుని ఓటీటీ లో విడుదల అవడానికి సిద్ధం అవుతుంది. మే 21 నుండి ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో అందుబాటులో ఉందనున్నట్టు నిర్మాత ఏ.ఆర్.రెహమాన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.