న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్ తో కేసులు విపరీతంగా పెరగడం, మరియు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడడం వల్ల నిరవధికంగా వాయిదా పడింది. దీన్ని మళ్లీ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తీవ్ర కసరత్తులు చేస్తున్నది.
బీసీసీఐ మిగిలిన మ్యాచ్‌లను ఏ వేదికలో ఎప్పడు నిర్వహించాలనే ఆంశం పై ప్రణాళికలు రచిస్తూనే ఉంది. ఐపీఎల్ -14లో మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణకు ఇంగ్లండ్‌ను ఫస్ట్ చాయిస్ గా బీసీసీఐ భావిస్తున్నది. ఈ విషయం పై ఈ నెల 29న జరిగే స్పెషల్ జనరల్ బాడీ(ఎస్‌జీఎం)లో చర్చంచనుంది. ఆగస్టు నెలలో ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌ను మార్చి ఆ స్థానంలో ఐపీఎల్‌ను నిర్వహించాలని భావిస్తోంది. టీ20 వరల్డ్‌కప్ కంటే ముందుగానే ఐపీఎల్-14 సెకండ్ ఫేజ్‌ను పూర్తి చేయాలని యోచిస్తోంది.
ఇంగ్లిష్ కౌంటీ క్లబ్‌లు తాము ఐపీఎల్ ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు రాగా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా సుముఖం వూక్తం చేసింది. ఖని ఇంగ్లండ్ లో టోర్నీ నిర్వహిస్తే ఖర్చు మాత్రం చాలా ఎక్కువ అవడం ఒక్కటే ప్రధాన సమస్యగా కన్పిస్తుంది. కానీ అక్కడి ప్రభుత్వం స్పోర్ట్ఫ్ ఈవెంట్ప్ కు ప్రేక్షకులను అనుమతిస్తున్నది.
దీంతో టికెట్ల ద్వారా ఫ్రాంచైజీలకు ఆదాయం చేకూరడంతో కొంత ఖర్చుల భారం తగ్గుతుంది.ఒక వేళ ఇంగ్లండ్‌లో నిర్వహించడం ఆర్థికంగా భారం అని భావిస్తే యూఏఈ, శ్రీలంకలను కూడా ప్రత్యామ్నాయ వేదికలుగా బీసీసీఐ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.