జెనీవా: కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్సలో కీలకంగా మారిన రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడిన వారికి ఇస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
డబ్ల్యూహెచ్వో అభిప్రాయం ప్రకారం రెమ్‌డెసివర్ వల్ల కరోనా బాధితులు ఎక్కడా కోలుకుంటున్నట్లు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఆందువల్ల కరోనా చికిత్సకు వాడే ఔషధాల నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
కాగా, డబ్ల్యూహెచ్వో భారత్‌లోనూ కరోనా బాధితుల చికిత్సకు వాడుతున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పైన కూడా తమకు పలు అనుమానాలు ఉన్నాయని, కరోనా బాధితులెవరికి ఆ ఇంజక్షన్ వాడొద్దని భారత వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత దేశంలో, చాలా రాష్ట్రాల్లో రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ దందా ద్వారా రేట్లు విపరీతంగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.