fbpx
Friday, December 27, 2024
HomeMovie Newsబర్త్ డే స్పెషల్: జూనియర్ ఎన్టీఆర్

బర్త్ డే స్పెషల్: జూనియర్ ఎన్టీఆర్

BirthDay SpecialArticle AboutJuniorNTR

టాలీవుడ్: నందమూరి తారక రామారావు వారసత్వం పుణికి తెచ్చుకుని ఆ పేరుని సార్ధకం చేస్తున్నాడు జూనియర్ నందమూరి తారక రామ రావు లేదా తారక్ లేదా యంగ్ టైగర్. ఇది మేము అంటున్న మాట కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అశేష మైన తారక్ ఫాన్స్, సినిమా అభిమానులు, ఇండస్ట్రీ లో ఉన్న మరి కొందరు హీరోలు, నటులు. ఇపుడు ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్ర అయినా సునాయాసంగా చేయడమే కాదు ఆ పాత్రకి పూర్తి న్యాయం చేయగల వ్యక్తి ఎవరు అంటే టక్కున గుర్తుకువచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్ అని ఇప్పటికే ఇండస్ట్రీ లో చాలా మంది చెప్పారు.

కానీ ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ ఒక్క రోజులో తెచ్చుకున్న పేరు కాదు. సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి పడిన కృషి కూడా కాదు. చిన్నప్పటి నుండి తన తల్లి క్లాసికల్ డాన్స్ లో ప్రిపేర్ చేసింది. సంవత్సరాల అకుంఠిత శ్రమ ఈరోజు ఎన్టీఆర్ ని కొన్ని కోట్ల మంది అభిమానించే వ్యక్తి గా నిలబెట్టాయి. జూనియర్ నటుడిగా చిన్నప్పుడే ‘రామాయణం’ సినిమా తీసి రాముడిగా ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్.

పెద్దయ్యాక ‘నిన్ను చూడాలని’ సినిమాతో పరిచయం అయ్యాడు. మొదటి సినిమా అంతగా ఆడలేదు. వెంటనే ఇపుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన ఎస్.ఎస్.రాజమౌళి తో ‘స్టూడెంట్ నెం.1 ‘ అని సినిమా తీసి మొదటి బ్లాక్ బస్టర్ సాధించాడు. దాదాపు రాజమౌళి మరియు ఎన్టీఆర్
సినీ ప్రయాణం ఒకేసారి ప్రారంభం అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత వీ.వీ.వినాయక్ దర్శకత్వంలో ఆది సినిమాలో నటించి కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇప్పటికీ ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన ‘అమ్మ తోడు అడ్డంగా నరుకుతా’ డైలాగ్ ఎవ్వరూ మర్చిపోలేరు.

మరో రెండు మూడు సినిమాల తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తో కలిసి ‘సింహాద్రి’ అనే సినిమా లో నటించాడు తారక్. ఈ సారి ఇండస్ట్రీ రికార్డ్స్ సాధించాడు. అప్పట్లో ఈ సినిమా కొన్ని ఇండస్ట్రీ రికార్డ్ లు సాధించింది. మాస్ హీరోగా అతి చిన్న వయసులో (అప్పటికి దాదాపు 25 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు) ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన హీరోగా జూనియర్ ఎన్ఠీఆర్ చరిత్ర సృష్టించాడు.

ఆ వెంటనే వరుస ప్లాప్ లు , యావరేజ్ సినిమాలతో సర్దిపెట్టుకున్నాడు. లావు ఎక్కువయ్యారు అని విమర్శలని మోస్తూ నెట్టుకొచ్చాడు. తారక్ ఫిజికల్ చేంజ్ ఓవర్ కి ముందు చేసిన చివరి సినిమా రాఖీ. ఈ సినిమాలో రాఖీ గా జూనియర్ ఎన్టీఆర్ కనబర్చిన నటన ఇండస్ట్రీ లో ఎవరూ చేయలేరని అప్పుడు టాక్ అఫ్ ఇండస్ట్రీ అయ్యాడు. ఈ సినిమాలో తన చెల్లి చనిపోయిన తర్వాత స్మశానం లో కూర్చొని ఏడ్చే సీన్ లో , సినిమా ఎండ్ లో కోర్ట్ లో ఎన్టీఆర్ నటనకి విజిల్స్ వేయని వాళ్ళు ఉండరు. ఆ సీన్స్ లలో ఎన్టీఆర్ నటన చూసి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అని చాలా మంది చెప్తుంటారు.

రాఖీ తర్వాత సన్నబడి శక్తి, కంత్రి లాంటి డిసాస్టర్ ల తర్వాత మరోసారి రాజమౌళి తో జత కట్టి ‘యమ దొంగ’ సినిమాతో కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమాలో ‘ఏమంటివి ఏమంటివి’ అంటూ సాగే తన తాత డైలాగ్ రీ-క్రియేషన్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న తారక్ ‘బృందావనం’ సినిమాతో లవర్ బాయ్ రోల్ చేసి మెప్పించాడు. అప్పటి నుండి వెర్సటైల్ పాత్రలు వేస్తూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఎన్నో హిట్లు సాధించాడు.

మరోసారి ప్లాప్ లలో ఉన్న తారక్ కి ‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ సాధించాడు. అక్కడి నుండి ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గారేజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ లాంటి సినిమాల్లో తనకే సాధ్యమైన కొత్త తరహా పాత్రలు వేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం ‘RRR ‘ సినిమాలో కొమరం భీం పాత్రతో మన ముందుకు రాబోతున్నాడు. వీటి తర్వాత కొరటాల శివ , కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో వరుస సినిమాలు లైన్ లో పెట్టి మరిన్ని మంచి సినిమాలు తీసి సినీ అభిమానుల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఒక్క హీరోగానే కాకుండా సింగర్ గా కూడా తారక్ తెలుగులో, కన్నడలో పాటలు పాడాడు. అంతే కాకుండా తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ లో హోస్ట్ గా చేసి తరువాత సీజన్ లలో వచ్చిన హోస్టులు రీచ్ అవలేని టార్గెట్స్ పెట్టి వెళ్ళాడు. ఇలా తాను ఏది మొదలుపెట్టినా అందులో పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నించే తారక్ ఇంకా ఎన్నో మైలు రాళ్లు అందుకోవాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular