టాలీవుడ్: గత కొన్ని రోజులుగా కొత్త రకమైన ప్రమోషన్స్ తో ‘ఏక్ మినీ కథ’ అనే సినిమా ఇండస్ట్రీ లో టాక్ గా నిలిచింది. పెద్ద సినిమాలు వాయిదా పడడం తో ఏప్రిల్ 24 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో థియేటర్లలో విడుదలకి నోచుకోలేదు. ఇప్పుడప్పుడే థియేటర్లు తెరచుకుని అవకాశం లేకపోవడం తో, కరోనా ఎఫెక్ట్ తగ్గి థియేటర్లు తెరచిన కూడా చాలా సినిమాలు లిస్ట్ లో ఉండడం తో మంచి ఆఫర్ రావడం తో ఈ సినిమాని ఓటీటీ కి అమ్మేసారు మేకర్స్.
గోల్కొండ హై కూల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంతోష్ శోభన్ 2015 లో ‘తను నేను’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. పేపర్ బాయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘సంతోష్’ యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్ లో ‘ఏక్ మినీ కథ’ అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. మనిషి శరీరం లోని ఒక లోపాన్ని బేస్ చేసుకుని కామెడీ జానర్ లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ , పాటలు ఆకట్టుకున్నాయి.
వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా లాంటి సినిమాల్ని రూపొందించిన మేర్లపాక గాంధీ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. మరిన్ని పాత్రల్లో బ్రహ్మాజీ, శ్రద్ధ దాస్, సుదర్శన్, సప్తగిరి నటించారు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాని కార్తీక్ రాపోలు అనే నూతన దర్శకుడు రూపొందించాడు. ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల చేయనున్నారు. మే 27 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమ్ అవనుంది.