టాలీవుడ్: విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న సినిమాల్లో హీరోగా చేస్తున్న శ్రీకాంత్ 1996 లో విడుదలైన ‘పెళ్లి సందడి’ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇప్పటికీ కూడా శ్రీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే మొదట ఈ పేరే వస్తుంది. రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ గా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అదే టైటిల్ తో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సంద D ‘ అనే సినిమాను రూపొందిస్తున్నారు. మరి ఈ సినిమాకి టైటిల్ అలాగే ఉంచి జెనెరేషన్ కి తగ్గట్టు చివర్లో D పెట్టారా లేక మరేదైనా కారణం ఉందా అనేది సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.
రోషన్ హీరోగా ‘నిర్మల కాన్వెంట్’ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో ఈ ‘పెళ్లిసంద D ‘ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా నుండి ‘బుజ్జిలు బుజ్జిలు’ అంటూ సాగే పాట విడుదలైంది. దర్శకేంద్రుడి స్టైల్ లో బాగానే ఆకట్టుకుంది. కానీ టైటిల్ లో ఉన్న కొత్తదనం పాటలో కానీ విజువల్స్ లో కానీ లేవని స్పష్టంగా తెలుస్తుంది. కొత్తగా వస్తున్న హీరోలందరూ, ఇంస్ట్రీ లో నిలదొక్కుకున్న హీరోలు కూడా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ద్వారా ఒక రొటీన్ సినిమాలానే అనిపిస్తుంది. అసలు టీజర్ కూడా చూడకుండా ఇలాంటి ఒపీనియన్ కి రావడం సబబు కాదు. కానీ సినిమా రొటీన్ కాకూండా ఒక కొత్త ప్రయత్నం ఐతే బాగుందనేది మా ఉదేశ్యం.