fbpx
Sunday, January 19, 2025
HomeAndhra Pradesh500 మందికి ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రయల్స్

500 మందికి ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రయల్స్

CLINICAL-TRIALS-OF-ANANDAYYA-MEDICINE-ON-500-MEMBERS

అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై తిరుమల తిరుపతి దేవస్థానాల ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభీంచిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సోమవారం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఆనందయ్య మందుపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. కాగా ఈ ఔషఢంపై ఆయుష్‌ నుంచి సమగ్ర నివేదిక రావాలి. ఆయుష్‌ నుంచి టీటీడీ అధ్వర్యంలోని ఆయుర్వేద కాలేజీకి నివేదిక పంపారు అని తెలిపారు.

క్లినికల్‌ ట్రయల్స్‌ అంశంలో మినిస్ట్రీ ఆష్‌ ఆయుష్‌ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ మందును తిరుపతి ఆయుర్వేద కాళాశాలలో తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాం. ఈ క్లినికల్ ట్రయల్స్ ను 500 మందిపై నిర్వహిస్తామన్నారు. కాగా ఈ నివేదిక రావడానికి ఒక వారం పడుతుంది. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్రానికి, రాష్ట్రానికి పంపాం.

టీటీడీ తరఫున ఈ ఆయుర్వేద మందును ప్రజలకు అందిచమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటాయి. ప్రజల మేలు కోసం కేంద్రం ఈ మందును నిర్థారణ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఈ మందు అందిస్తుంది అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular