హాలీవుడ్: ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళకి మార్వెల్ గురించి తెలిసిన విషయమే. కామిక్ బుక్స్ ఆధారంగా చేసుకుని సూపర్ హీరో సినిమాలని రూపొందిస్తూ సూపర్ కలెక్షన్స్ తో హాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. అవెంజర్స్ పేరుతో సిరీస్ సినిమాలని రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం వీరి దగ్గరి నుండి ‘ఎటర్నల్స్’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదలైంది. రెగ్యులర్ మార్వెల్ సినిమాల మాదిరిగా ఈ సినిమా టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఏమి చూపించలేదు. ఇందులో చూపించిన పాత్రలు కూడా కొత్తవి అవడం విశేషం.
మామూలుగా అవెంజర్స్ పాత్రలు మొదలుపెట్టే ముందు ఆ పాత్రకి పరిచయంగా ముందు వచ్చిన సినిమాలో ఎంతో కొంత పరిచయం ఉంటుంది. కానీ ఈ ‘ఎటర్నల్స్’ టీజర్ లో చూపించిన పాత్రలన్నీ మొదటిసారి కనిపిస్తున్నారు. నిరాశతో , నిస్సహాయంగా ఉన్న ఒక సముద్ర తీరపు ఊర్లోకి ఒక పెద్ద ఫ్లైయింగ్ సాసర్ లాంటి మీడియం ద్వారా ఈ ఎటర్నల్స్ అందరూ ఆ వూర్లో ల్యాండ్ అవుతారు. అందులో వచ్చిన వాళ్ళందరూ సూపర్ పవర్స్ తో ఆ ఊరిని శశ్యశ్యామలం చేస్తారు. ఆ తర్వాత సీన్ లో వాళ్ళందరూ కలిసి ఒక ఫామిలీ లాగ కూర్చొని భోజనం చేస్తారు.
ఈ సినిమాలో హాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ ఏంజెలీనా జోలీ, సల్మా హాయక్ లతో పాటు గేమ్ అఫ్ థ్రోన్స్ ఫేమ్ రిచర్డ్ మాడెన్ , కిట్ హారింగ్టన్ , కుమాయిల్ నంజియాని ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ టీజర్ లో ఇండియన్ ఆరిజిన్ కి సంబందించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాని నవంబర్ లో విడుదల చేయనున్నారు.